డ్రైవింగ్ చేస్తూ గుట్కా వేసుకున్న డ్రైవర్.. అదుపు తప్పిన బస్సు .. పలువురికి గాయాలు!

  • టీఎస్ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
  • కాళేశ్వరం నుండి గోదావరిఖనికి వెళుతుండగా ఘటన
  • ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు
ఓ పక్క డ్రైవింగ్ చేస్తూ, మరోపక్క డ్రైవర్ గుట్కా వేసుకుంటుండడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుండి భూపాలపల్లికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో వేసుకుంటున్న సమయంలో మల్హర్ మండల పరిధిలోని టీవీనగర్ సమీపంలోని మానేరు బ్రిడ్జి దాటుతుండగా బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న తొమ్మిది మీటర్ల లోతు గోతిలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మహదేవ్ పూర్, మంథని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
Go Back to Shorts
TRTRC
Kaleswaram
Godavari khani
bus
accident
adavai somanpalli

More Telugu News